తెలంగాణలో మరో 185 మందికి కరోనా పాజిటివ్

Telangana Covid details
  • గత 24 గంటల్లో 41,484 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 78 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,761 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 41,484 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 185 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 78 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 14, ఖమ్మం జిల్లాలో 14, హనుమకొండ జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 205 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,79,430 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,71,655 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,761 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 4,014కి పెరిగింది.
Go Back to Shorts
Telangana
COVID19
Update
Today Cases

More Telugu News