తెలంగాణలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాప్తి

Telangana covid daily report
  • గత 24 గంటల్లో 38,467 కరోనా పరీక్షలు
  • 207 మందికి పాజిటివ్
  • జీహెచ్ఎంసీ పరిధిలో 82 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,897 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 38,467 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 207 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 82 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 19, కరీంనగర్ జిల్లాలో 16, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14 కేసులు గుర్తించారు. అదే సమయంలో 196 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,77,954 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,70,053 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,897 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మరణించినవారి సంఖ్య 4,004కి పెరిగింది.
Go Back to Shorts
Telangana
COVID19
Media Bulletin
Today Cases

More Telugu News