తెలంగాణలో మరో 203 మందికి కొవిడ్ పాజిటివ్

Telangana Covid Daily Report
  • గత 24 గంటల్లో 40,730 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 87 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,852 మందికి చికిత్స
తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 40,730 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 203 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 87 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 19, కరీంనగర్ జిల్లాలో 12, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 12 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 160 మంది కరోనా నుంచి కోలుకోగా, రాష్ట్రంలో ఒక మరణం సంభవించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,77,341కి పెరిగింది. 6,69,488 మంది కరోనా నుంచి విముక్తులు కాగా, ఇంకా 3,852 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 4,001కి పెరిగింది.
Go Back to Shorts
Telangana
COVID19
Today Cases
Media Bulletin

More Telugu News