పాకిస్థాన్ కు 3 బిలియన్ డాలర్ల రుణం మంజూరు చేసిన సౌదీ అరేబియా
- కొన్నాళ్లుగా పతనం దిశగా పాక్ ఆర్థిక వ్యవస్థ
- రుణాలతోనే నెట్టుకొస్తున్న వైనం
- ఆపన్న హస్తం అందించిన సౌదీ అరేబియా
- సౌదీ యువరాజుకు కృతజ్ఞతలు తెలిపిన పాక్ ప్రభుత్వం
ఇటీవల కాలంలో పాక్ తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడం, విదేశీ మారకద్రవ్య నిల్వలు తరిగిపోవడం, ద్రవ్య ఖాతాల లోటు మరింత విస్తరించడం, పాక్ రూపీ విలువ మరింత దిగజారడం పాక్ ను కుదేలు చేశాయి. ప్రస్తుతం పాకిస్థాన్ వద్ద 2,22,498 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యం మాత్రమే మిగిలుంది.