పాజిటివ్, నెగటివ్ ఎలా అయింది?.. ఐసోలేషన్ నుంచి ఎలా తప్పించుకున్నాడు?: సౌతాఫ్రికా వాసి పరారీపై విచారణకు ఆదేశించిన కర్ణాటక
- దేశం విడిచి ఎలా వెళ్లగలిగాడు?
- ప్రైవేటు ల్యాబ్ లో అక్రమాలపై అనుమానాలు
- జాడలేని పదిమందిని కూడా ట్రేస్ చేస్తామన్న మంత్రి
ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై అధ్యక్షతన నిన్న జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అనంతరం మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. అలాగే, దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన పది మంది జాడ తెలియరావడం లేదంటూ వస్తున్న వార్తలపై స్పందించిన మంత్రి వారిని ట్రేస్ చేయాలని ఆదేశించినట్టు చెప్పారు. వారిని గుర్తించే సమర్థత పోలీసులకు ఉందని పేర్కొన్నారు. అందరూ బాధ్యతతో మెలగాలని, ఎవరూ తమ ఫోన్లను స్విచ్చాఫ్ చేసుకోవద్దని కోరారు.