తెలంగాణలో మరో 189 మందికి కరోనా

Telangana Corona daily report
  • గత 24 గంటల్లో 36,883 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 77 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 3,680 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 36,883 నమూనాలు పరీక్షించగా, 189 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 77 కొత్త కేసులు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 12, వరంగల్ అర్బన్ జిల్లాలో 10, కరీంనగర్ జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 137 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,76,376 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,68,701 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,680 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,995కి పెరిగింది.
Go Back to Shorts
Telangana
Corona Virus
Daily Report
Today Cases

More Telugu News