తెలంగాణలో మరో 189 మందికి కరోనా
- గత 24 గంటల్లో 36,883 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 77 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 3,680 మందికి చికిత్స
అదే సమయంలో 137 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,76,376 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,68,701 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,680 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,995కి పెరిగింది.
