'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్?
- 'పుష్ప' పై పెరుగుతున్న అంచనాలు
- వచ్చేనెల 6వ తేదీన ట్రైలర్ రిలీజ్
- 12వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
- 17వ తేదీన సినిమా విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి వచ్చేనెల 6వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే దేవిశ్రీ సాంగ్స్ పరంగా ఈ సినిమా ఒక రేంజ్ కి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. ట్రైలర్ తో ఆ రేంజ్ మరింత పెరగడం ఖాయమని చెప్పుకుంటున్నారు. ఇక వచ్చేనెల 12వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో జరపనున్నట్టు తెలుస్తోంది.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ప్రభాస్ రానున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఆయనను ఆహ్వానించడం జరిగిపోయిందని అంటున్నారు. అయితే అధికారికంగా మాత్రం ఎటు వైపు నుంచి ప్రకటన లేదు. మరి ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక అలరించనుండగా, సమంత స్పెషల్ సాంగ్ మరింత ఆకర్షణగా నిలవనుంది.