Allu Arjun: 'రాధే శ్యామ్' దర్శకుడితో అల్లు అర్జున్?

Allu Arjun in Radhakrishna Kumar movie
షార్ట్స్‌లో చూడండి
అల్లు అర్జున్ తాజా చిత్రంగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా ఫాహద్ ఫాజిల్ కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాను, డిసెంబర్ 17వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ సినిమా తరువాత ఏ బ్యానర్లో .. ఏ దర్శకుడితో బన్నీ సినిమా ఉండనుందనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వేణు శ్రీరామ్ తో 'ఐకాన్' చేయవచ్చనే టాక్ వినిపించింది. కానీ రాను రాను ఆ టాక్ మసకబారుతూ వచ్చింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టును గురించి ఎవరూ ఎక్కడా మాట్లాడటం లేదు.

బోయపాటితోనే బన్నీ సినిమా ఉండొచ్చనే ప్రచారం జరిగింది. 'సరైనోడు'తో హిట్ ఇచ్చిన ఆయనతోనే చేయాలని ఫిక్స్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు పరశురామ్ .. రాధాకృష్ణ కుమార్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ ముగ్గురిలో ఎవరు తమ స్క్రిప్ట్ తో మెప్పిస్తే వాళ్లతో సెట్స్ పైకి వెళ్లాలనే ఉద్దేశంతో బన్నీ ఉన్నాడని చెప్పుకుంటున్నారు.
Go Back to Shorts
Allu Arjun
Boyapati Sreenu
Parashuram
Radhakrishna Kumar

More Telugu News