తెలంగాణలో మరో 156 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 34,764 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 55 కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 3,533 మందికి చికిత్స
అదే సమయంలో 155 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,75,001 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,67,483 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,533 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,985కి పెరిగింది.
