మరో నిర్మాతకు మాట ఇచ్చిన మెగాస్టార్?
- వరుస సినిమాలతో బిజీగా చిరంజీవి
- విష్ణువర్ధన్ ఇందూరి నుంచి కొత్త ప్రాజెక్టు
- 'విజేత' సీక్వెల్ అంటూ టాక్
- లైన్లో మారుతి .. వెంకీ కుడుముల
అందువలన ఇటీవల ఇద్దరూ కలిసినప్పుడు తమ కాంబినేషన్లో ఒక సినిమా చేస్తే బాగుంటుందని విష్ణు అనగా, అందుకు చిరంజీవి సుముఖతను వ్యక్తం చేశారట. తనకి చిరంజీవి సినిమాల్లో 'విజేత' అంటే ఎంతో ఇష్టమనీ, ఆ సినిమాకి సీక్వెల్ ను గానీ .. ఆ తరహాలో గాని మరో సినిమా చేయాలనుందని విష్ణు చెప్పారట.
దాంతో ఇప్పుడు అందరూ ఈ విషయాన్ని గురించే మాట్లాడుకుంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు డైరెక్టర్ ఎవరనే విషయంతో పాటు ఇతర వివరాలను ప్రకటిస్తారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి 'గాడ్ ఫాదర్' .. 'భోళా శంకర్' .. 'వాల్తేర్ వాసు' సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆ తరువాత దర్శకులుగా మారుతి .. వెంకీ కుడుముల పేర్లు వినిపిస్తున్నాయి.