ఎమ్మెల్సీగా మధుసూదనాచారి.. గవర్నర్ ఆమోదం!
- గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా మధుసూదనాచారి
- ఫైల్ పై సంతకం చేసిన గవర్నర్ తమిళిసై
- దేశపతి శ్రీనివాస్ పేరును కూడా పరిశీలించిన కేసీఆర్
తొలుత కౌశిక్ రెడ్డి పేరును ప్రతిపాదిస్తూ గవర్నర్ కు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ఫైలును గవర్నర్ హోల్డ్ లో ఉంచారు. దీంతో ఆ ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత గవర్నర్ కోటాలో మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్ పేర్లను పరిశీలించిన కేసీఆర్... చివరకు మధుసూదనాచారికి అవకాశాన్ని కల్పించారు.