తెలంగాణలో మరో 167 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 37,283 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 55 కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 3,737 మందికి చికిత్స
అదే సమయంలో 164 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,73,889 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,66,176 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,737 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,976కి పెరిగింది.
