ఏపీలో మరింత కనిష్ఠానికి కరోనా రోజువారీ కేసులు

AP Corona Media Bulletin
  • గత 24 గంటల్లో 21,360 కరోనా పరీక్షలు
  • 117 మందికి పాజిటివ్
  • చిత్తూరు జిల్లాలో 24 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 2,961 మందికి చికిత్స
ఏపీలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య బాగా తగ్గింది. గడచిన 24 గంటల్లో 21,360 కరోనా పరీక్షలు నిర్వహించగా, 117 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 24 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 19 కేసులను గుర్తించారు. విజయనగరం, కర్నూలు జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

ఇక అదే సమయంలో 241 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,70,095 పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 20,52,718 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 2,961 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,416కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Today Cases
Media Report

More Telugu News