హైదరాబాదులో రూ. 2 కోట్ల ఫేక్ కరెన్సీ పట్టివేత!
- గోల్కొండ పీఎస్ పరిధిలో ఫేక్ కరెన్సీ కలకలం
- ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
- ఫేక్ కరెన్సీని అఫ్జల్ గంజ్ లో కొనుగోలు చేసిన సుదర్శన్ అనే వ్యక్తి
ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ... ఈ నోట్లతో సంబంధం ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేశామని తెలిపారు. లంగర్ హౌస్ కు చెందిన లక్ష్మి అనే మహిళను వీరు నకిలీ నోట్లతో మోసం చేసే ప్రయత్నం చేశారని చెప్పారు. ఆమెకు అప్పుగా నకిలీ కరెన్సీని ఇచ్చేందుకు సుదర్శన్ అనే వ్యక్తి ప్లాన్ చేశాడని తెలిపారు. ఈ నోట్లను అఫ్జల్ గంజ్ లో సుదర్శన్ కొనుగోలు చేశాడని చెప్పారు. ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.