తెలంగాణలో కొత్తగా 164 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 36,999 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 51 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 3,815 మందికి చికిత్స
అదే సమయంలో 186 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,72,367 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,64,588 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,815 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,964కి పెరిగింది.
