ఇంతకీ మహేశ్ తో త్రివిక్రమ్ మూవీ ఉన్నట్టా? లేనట్టా?

Trivikram and Mahesh Babu Movie Update
  • మహేశ్ తో చేయాలనుకున్న త్రివిక్రమ్
  • ఈ ప్రాజెక్టులో ఎలాంటి కదలిక లేదు
  • మరోసారి బన్నీతోనే త్రివిక్రమ్ అంటూ టాక్
  • నిర్మాత ట్వీట్ తో బలపడుతున్న అనుమానాలు
త్రివిక్రమ్ - ఎన్టీఆర్ ప్రాజెక్టు పట్టాలెక్కవలసింది .. కానీ ఆ ప్రాజెక్టు పక్కకి పోయింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబుతో తమ సినిమా ఉండనుందని హారిక అండ్ హాసిని వారు చెప్పారు కూడా. మహేశ్ బాబు కూడా ఇటీవల తన అభిమానులను కలిసినప్పుడు తన తదుపరి సినిమా త్రివిక్రమ్ తో ఉండనుందని అన్నాడు.

అయితే త్రివిక్రమ్ - మహేశ్ బాబుకు సంబంధించిన ప్రాజెక్టులో ఎక్కడా కూడా కదలిక కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ - అల్లు అర్జున్ .. తమన్ .. సూర్యదేవర నాగవంశీ, 'వరుడు కావలెను' వేదికపై కలుసుకున్నారు. అది ఆ ఫంక్షన్ వరకే పరిమితం కాలేదు. త్వరలో ఒక సర్ప్రైజ్ ఉందని సూర్యదేవర నాగవంశీ చెప్పడంతో, మొత్తానికి 'అల వైకుంఠపురములో' కాంబినేషన్లో మరో సినిమా ఉండొచ్చని అనుకున్నారు.

అంతవరకూ బాగానే ఉంది .. కానీ ఇప్పుడు మరో ప్రచారం జోరుగా జరుగుతోంది. త్రివిక్రమ్ - అల్లు అర్జున్ మరోసారి రెడీ అవుతున్నారంటే, మహేశ్ బాబుతో సినిమా వాయిదా పడినట్టేనని చెప్పుకుంటున్నారు. మహేశ్ బాబు ప్రాజెక్టు తరువాత త్రివిక్రమ్ ..బన్నీతో కలిసి సెట్స్ పైకి వెళతాడా? మహేశ్ బాబు ప్రాజెక్టుకు బదులుగా బన్నీ సినిమాను పట్టాలెక్కిస్తున్నాడా? అనే విషయంలో క్లారిటీ రావలసి ఉంది.
Go Back to Shorts
Trivikram Srinivas
Mahesh Babu
Allu Arjun

More Telugu News