ఏపీలో కొత్తగా 381 మందికి కరోనా పాజిటివ్

AP Corona Media Bulletin
  • గత 24 గంటల్లో 38,896 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 82 కొత్త కేసులు
  • కర్నూలు జిల్లాలో ముగ్గురికి పాజిటివ్
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 4,743 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 38,896 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 381 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 82 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 61, తూర్పు గోదావరి జిల్లాలో 57, విశాఖ జిల్లాలో 43 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 414 మంది కరోనా నుంచి కోలుకోగా, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,65,235 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,46,127 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,743 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,365కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Media Report
Today Cases
Daily Update

More Telugu News