ఏపీలో కొత్తగా 381 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 38,896 కరోనా పరీక్షలు
- చిత్తూరు జిల్లాలో 82 కొత్త కేసులు
- కర్నూలు జిల్లాలో ముగ్గురికి పాజిటివ్
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 4,743 మందికి చికిత్స
అదే సమయంలో 414 మంది కరోనా నుంచి కోలుకోగా, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,65,235 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,46,127 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,743 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,365కి పెరిగింది.