ఏపీలో గత 24 గంటల్లో 415 కరోనా కేసుల వెల్లడి

  • గత 24 గంటల్లో 33,944 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 93 కొత్త కేసులు
  • విజయనగరం జిల్లాలో ముగ్గురికి పాజిటివ్
  • రాష్ట్రంలో ఆరుగురి మృతి
  • ఇంకా 4,655 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 33,944 కరోనా పరీక్షలు నిర్వహించగా 415 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 93 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 76, పశ్చిమ గోదావరి జిల్లాలో 53, గుంటూరు జిల్లాలో 50 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 3 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 584 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,356కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,64,287 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,45,276 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,655 మంది చికిత్స పొందుతున్నారు.

Andhra Pradesh
Corona Virus
Media Report
Today Cases

More Telugu News