తెలంగాణలో కొత్తగా 179 కరోనా కేసులు
- గత 24 గంటల్లో 38,588 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 66 కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 4,023 మందికి చికిత్స
అదే సమయంలో 104 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,70,453 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,62,481 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,023 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,949కి పెరిగింది.
