ఆనందయ్య మందుపై హైకోర్టులో వాదోపవాదాలు
- కంటి చుక్కల మందు తయారుచేసిన ఆనందయ్య
- ప్రభుత్వ అనుమతికోసం దరఖాస్తు
- కోర్టులో రిట్ పిటిషన్
- ఆనందయ్య దరఖాస్తును పరిశీలించాలన్న న్యాయస్థానం
అయితే, అసలు, ఆనందయ్య ప్రభుత్వానికి ఇంతవరకు దరఖాస్తు చేసుకోలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై ఆనందయ్య న్యాయవాది స్పందిస్తూ, ప్రభుత్వానికి చేసుకున్న దరఖాస్తును, అందుకు ప్రభుత్వం వెలిబుచ్చిన స్పందనను కోర్టుకు సమర్పించారు.
అనంతరం ప్రభుత్వ న్యాయవాది తమ వాదనలు కొనసాగిస్తూ, ఆనందయ్య కంటి చుక్కల మందు ప్రమాదకరం అని వెల్లడించారు. దాంతో కోర్టు... ఆనందయ్య మందు కారణంగా ఎందరు చనిపోయారు? కరోనా వల్ల ప్రభుత్వాసుపత్రుల్లో ఎందరు చనిపోయారు? అంటూ ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అంతేకాదు, ఆనందయ్య దరఖాస్తును వెంటనే పరిశీలించాలని, సాంకేతిక కారణాలు అడ్డుచెప్పి దరఖాస్తును తిరస్కరించవద్దని పేర్కొంది.