హోంగార్డు లింగయ్య తల్లికి పాదాభివందనం చేసిన సీపీ మహేశ్ భగవత్.. వీడియో ఇదిగో
- సీపీ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
- అమరవీరుల కుటుంబాలను సత్కరించిన మహేశ్ భగవత్
- 2015లో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డు లింగయ్య
అంబర్‌పేట్ కార్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హోంగార్డు లింగయ్య తల్లి సారమ్మ పాల్గొంది. ఈ నేపథ్యంలో ఆమెకు మహేశ్ భగవత్ పాదాభివందనం చేశారు. కాగా, 2015లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆత్మకూర్ పరిధిలోని సిమీ ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు పోలీసులతో పాటు హోంగార్డు లింగయ్య అమరులయ్యారు. వారందరికీ పోలీసులు నివాళులు అర్పించారు.