తెలంగాణలో గత 24 గంటల్లో 176 కరోనా కేసులు
- రాష్ట్రంలో 37,857 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 53 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 4,365 మందికి చికిత్స
అదే సమయంలో 216 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,67,334 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,59,043 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,365 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,926కి పెరిగింది.
