గ‌త రాత్రి అదృశ్య‌మైన విశాఖ బాలిక.. చివరికి విగ‌త‌జీవిగా కనపడిన వైనం

girl death in vizag
  • విశాఖ‌లోని అగనంపూడిలోని శనివాడలో ఘ‌ట‌న‌
  • అపార్ట్‌మెంటు వ‌ద్ద ప‌నిచేసుకుంటూ ఉపాధి పొందుతోన్న‌ బాలిక‌ కుటుంబం
  • బాలిక‌ మృతదేహంతో కుటుంబ స‌భ్యులు, స్థానికుల ఆందోళన
గ‌త రాత్రి అదృశ్య‌మైన ఓ బాలిక అపార్ట్‌మెంట్ వ‌ద్ద విగ‌త‌జీవిగా క‌న‌ప‌డ‌డం విశాఖ‌లోని అగనంపూడి, శనివాడలో అల‌జ‌డి రేపింది. నిన్న రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద 13 ఏళ్ల ఓ బాలిక క‌న‌ప‌డ‌కుండా పోయింది. ఆమె కోసం కుటుంబ స‌భ్యులు, స్థానికులు వెతక‌డం ప్రారంభించారు. చివ‌ర‌కు అపార్ట్‌మెంట్‌ వద్దే ఆ బాలిక‌ మృతదేహాన్ని గుర్తించారు.

ఆ బాలిక విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం బైరెడ్డి పేటకు చెందిన ఓ దంప‌తుల కుమార్తె. ఆ కుటుంబం ఉపాధి కోసం విశాఖ‌లోని అగనంపూడికి వ‌చ్చి ఉంటోంది. అక్క‌డే ఓ అపార్ట్‌మెంట్‌లో ఆ కుటుంబం పనిచేస్తోంది.  

ఈ ఘ‌ట‌న‌పై కూర్మన్నపాలెం పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు. బాలిక‌ మృతదేహంతో కుటుంబ స‌భ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.
Go Back to Shorts
Crime News
Vizag
Andhra Pradesh

More Telugu News