ఇదీ మన రాష్ట్రంలో ఉన్న దుస్థితి: వీడియో పోస్ట్ చేసిన నాగబాబు
- గాంధీ జయంతి సందర్భంగా జనసేన శ్రమదానం
- రోడ్డు బాగుచేయనివ్వకుండా అడ్డంకులు
- అయినప్పటికీ రోడ్డు బాగు చేసిన జనసైనికులు
- జన సేవకు కూడా ఒక యుద్ధమే చేయవలసి వస్తోందన్న నాగబాబు
'మన రాష్ట్రంలోని దుస్థితి ఏంటంటే జన సేవకు కూడా ఒక యుద్ధమే చేయవలసి వస్తోంది. చంద్రగిరి నియోజక వర్గంలోని జనసైనిక్ మనోహర్ దేవర శ్రీవిద్యా నికేతన్ సంస్థ సమీపంలో అరకిలోమీటరు రోడ్డును బాగు చేయించారు. కొందరు అడ్డుకోవాలని చూసినప్పటికీ విజయవంతంగా పని పూర్తి చేశారు' అని నాగబాబు చెప్పారు. కాగా, రోడ్డు వేసేందుకు కావాల్సిన మెటీరియల్‌ను ఆ ప్రాంతంలోకి రాకుండా అడ్డుకోవాలని కొందరు ప్రయత్నాలు చేశారని వీడియోలో జనసేన చెప్పింది.