తెలంగాణ‌లోని గ్రామాల‌ను చూసి ఇత‌ర రాష్ట్రాల వారు ఆశ్చ‌ర్య‌పోతున్నారు: కేసీఆర్

01-10-2021 Fri 11:19 | Telangana
  • గ‌త ప్ర‌భుత్వాల హ‌యాంలో స‌ర్పంచులకు ఎన్నో ఇబ్బందులు
  • ఇప్పుడు స‌ర్పంచుల‌కు ఎలాంటి ఇబ్బందులూ లేవు
  • గ్రామాల్లో ప్ర‌జ‌లకు అన్ని సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నామ‌న్న కేసీఆర్
  • అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం
తెలంగాణ‌లోని గ్రామాల‌ను చూసి ఇత‌ర రాష్ట్రాల్లోని గ్రామాల ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్య‌పోతున్నార‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. ఈ రోజు ఆయ‌న తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ... గ‌త ప్ర‌భుత్వాల హ‌యాంలో స‌ర్పంచులు ఎన్నో ఇబ్బందులు ప‌డ్డార‌ని ఆయ‌న చెప్పారు. త‌మ ప్ర‌భుత్వ పాల‌న‌లో స‌ర్పంచుల‌కు ఎలాంటి ఇబ్బందులూ లేవ‌ని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో స‌ర్పంచులు గౌర‌వంగా బ‌తుకుతున్నార‌ని చెప్పారు. గ్రామాల్లో ప్ర‌జ‌లకు అన్ని సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు.

కాగా, తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. తెలంగాణ‌లో గులాబ్ తుపాను ప్ర‌భావంతో కురిసిన భారీ వర్షాలకు పంట నష్టం వాటిల్లింద‌ని కాంగ్రెస్ తెలిపింది. న‌ష్ట‌పోయి స‌మ‌స్య‌ల్లో ప‌డ్డ‌ రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంద‌ని పేర్కొంది. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అసెంబ్లీలో ఆ అంశాల‌ని చర్చించాలని కాంగ్రెస్ కోరింది. అంత‌కు ముందు శాస‌న‌స‌భ‌లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నోత్త‌రాలు ప్రారంభించారు. స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు హ‌రీశ్ రావుతో పాటు ప‌లువురు మంత్రులు స‌మాధానం ఇచ్చారు.
KCRTRSTelangana

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more