హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు బీ-ఫారం అందజేత.. ఎమ్మెల్యేగా తిరిగి వస్తావంటూ కేసీఆర్ ఆశీర్వాదం
- హుజూరాబాద్ మనకు కంచుకోట
- పార్టీకి ద్రోహం చేసిన వారికి అక్కడ చోటు లేదు
- ప్రచార ఖర్చుల కోసం రూ. 28 లక్షల చెక్కు అందజేత
హుజూరాబాద్ టీఆర్ఎస్కు కంచుకోట అని, అక్కడ వ్యక్తులుగా కాకుండా పార్టీ ఎదిగిందని అన్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారికి అక్కడ చోటు లేదన్నారు. అక్కడ మనదే గెలుపని సర్వేలన్నీ చెబుతున్నాయని అన్నారు. ఎన్నికల ప్రచార సభలో తాను కూడా పాల్గొంటానని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ. 28 లక్షల చెక్కును ఈ సందర్భంగా శ్రీనివాస్ కు అందజేశారు.