తెలంగాణలో 200కి దిగువన రోజువారీ కరోనా కేసులు
- గత 24 గంటల్లో 34,200 కరోనా పరీక్షలు
- 170 పాజిటివ్ కేసులు నమోదు
- జీహెచ్ఎంసీ పరిధిలో 68 కొత్త కేసులు
- ఇంకా 4,612 మందికి చికిత్స
అదే సమయంలో 259 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఒక్క మరణం కూడా సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,65,068 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,56,544 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,612 మంది చికిత్స పొందుతున్నారు.
