నెట్ ఫ్లిక్స్ కి 'శ్యామ్ సింగ రాయ్' డిజిటల్ రైట్స్!
- డిఫరెంట్ కాన్సెప్ట్ తో 'శ్యామ్ సింగ రాయ్'
- నాని సరసన ముగ్గురు నాయికలు
- సంగీత దర్శకుడిగా మీక్కీ జె మేయర్
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
నాని సరసన నాయికలుగా సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా సెబాస్టియన్ అలరించనున్నారు. ఈ ముగ్గురు పాత్రలకి కూడా ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను, నెట్ ఫ్లిక్స్ వారు భారీరేటుకు దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది.
ముందుగా ఈ సినిమా థియేటర్లకే రానుంది .. ఆ తరువాత నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా కోసం పది ఎకరాలో సెట్స్ వేసి మేజర్ పార్టును అందులోనే చిత్రీకరించారు. ఇటీవల వచ్చిన నాని 'టక్ జగదీష్' యావరేజ్ అనిపించుకుంది. మరి 'శ్యామ్ సింగ రాయ్' తో హిట్ కొడతాడేమో చూడాలి.