తెలంగాణ రోజువారీ కరోనా కేసుల వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 45,274 కరోనా పరీక్షలు
- 208 మందికి పాజిటివ్
- జీహెచ్ఎంసీ పరిధిలో 49 కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 4,991 మందికి చికిత్స
వికారాబాద్, నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.
అదే సమయంలో 220 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,63,662 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,54,765 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 4,991 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,906కి పెరిగింది.
