తెలంగాణలో మరింత తగ్గిన రోజువారీ కొవిడ్ కేసులు
- గత 24 గంటల్లో 35,160 కరోనా పరీక్షలు
- 173 మందికి పాజిటివ్
- జీహెచ్ఎంసీ పరిధిలో 64 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 5,005 మందికి చికిత్స
అదే సమయంలో 315 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,63,454 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,54,545 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 5,005 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 3,904కి పెరిగింది.
