ఏపీలో కొత్తగా 1,174 మందికి కొవిడ్ పాజిటివ్

AP Covid report
  • గత 24 గంటల్లో 55,525 కరోనా పరీక్షలు
  • తూర్పుగోదావరి జిల్లాలో 208 కేసులు
  • కర్నూలు జిల్లాలో 5 కేసులు
  • రాష్ట్రంలో 9 మంది కరోనాతో మృతి
  • ఇంకా 14,653 మందికి చికిత్స 
ఏపీలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 55,525 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,174 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 208 కొత్త కేసులు నమోదు కాగా, ప్రకాశం జిల్లాలో 161, చిత్తూరు జిల్లాలో 159, కృష్ణా జిల్లాలో 140, గుంటూరు జిల్లాలో 131, నెల్లూరు జిల్లాలో 122 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 5 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 1,309 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,061కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,37,353 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,08,639 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 14,653 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
COVID19
Media Report
Daily Bulletin
Today Cases

More Telugu News