ఏపీలో కొత్తగా 1,174 మందికి కొవిడ్ పాజిటివ్
- గత 24 గంటల్లో 55,525 కరోనా పరీక్షలు
- తూర్పుగోదావరి జిల్లాలో 208 కేసులు
- కర్నూలు జిల్లాలో 5 కేసులు
- రాష్ట్రంలో 9 మంది కరోనాతో మృతి
- ఇంకా 14,653 మందికి చికిత్స
అదే సమయంలో 1,309 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,061కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,37,353 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,08,639 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 14,653 మంది చికిత్స పొందుతున్నారు.