మద్యం షాపుల కేటాయింపుల్లో రిజర్వేషన్... తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
- త్వరలో ముగియనున్న వైన్ షాపుల కాలపరిమితి
- కొత్త వైన్ షాపులకు త్వరలోనే టెండర్లు
- గౌడ కులస్తులు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు
ఈ నేపథ్యంలో త్వరలోనే మద్యం షాపులకు టెండర్లను ఆహ్వానించబోతున్నారు. ఈ టెండర్లలో రిజర్వేషన్లను అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం చొప్పున షాపులను కేటాయించేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మరోవైపు దళితబంధు పథకం ప్రారంభం సందర్భంగా మద్యం షాపుల్లో ఎస్సీలకు రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.