కశ్మీర్ నుంచి కన్నియా కుమారి వరకు వివక్ష బాధతో ఉన్న వర్గం ఏదైనా ఉందంటే అది దళితజాతే: సీఎం కేసీఆర్

13-09-2021 Mon 22:03 | Telangana
  • దళిత బంధు సన్నాహక సమావేశం
  • దళితులకు యావత్ సమాజం అండగా నిలవాలన్న కేసీఆర్
  • వ్యాపారవర్గంగా నిలబెట్టాలని పిలుపు
  • ఇదేమీ రొటీన్ కార్యక్రమం కాదని వెల్లడి
  • గతంలో ఎవరూ చేపట్టలేదని స్పష్టీకరణ
తెలంగాణ సీఎం కేసీఆర్ దళిత బంధు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కశ్మీర్ నుంచి కన్నియా కుమారి వరకు వివక్ష బాధతో ఉన్న వర్గం ఏదైనా ఉందంటే అది దళిత జాతేనని అన్నారు. ఈ అంశాన్ని అనేక జాతీయ, అంతర్జాతీయ తులనాత్మక అధ్యయనాలు స్పష్టం చేశాయని వివరించారు.

ఓ కుటుంబంలో ఎవరికైనా ఆపద వస్తే ఎలా ఆదుకుంటామో, అదే స్ఫూర్తితో దళితులకు యావత్ సమాజం అండగా నిలవాల్సిన బాధ్యత ఉందని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసి, వారిని వ్యాపార వర్గంగా నిలబెట్టాలన్న ఉద్దేశంతో తీసుకువచ్చిందే దళిత బంధు అని స్పష్టం చేశారు. తరతరాలుగా దళితులను వెంటాడుతున్న ఆర్థిక, సామాజిక వివక్షను నిర్మూలించాలన్న అత్యున్నత ఆశయంతో దళితబంధు అమల్లోకి తెచ్చామని వివరించారు.

దళితబంధు ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. దళిత బంధు దేశంలో గతంలో ఎవరూ చేపట్టని వినూత్న పథకం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇదేమీ రొటీన్ కార్యక్రమం కాదని, ఏ కేంద్ర ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పథకం తీసుకురాలేదని స్పష్టం చేశారు.

నాడు తెలంగాణ ఉద్యమం కూడా వివక్షకు వ్యతిరేకంగానే సాగిందని, ఇప్పుడు దళిత బంధును ఓ ఉద్యమంగా అమలు చేయడంలో తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ఇమిడి ఉందని ఉద్ఘాటించారు.
CM KCRDalitha BandhuTRSTelangana

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more