తెలంగాణ రోజువారీ కొవిడ్ కేసుల వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 75,199 కరోనా పరీక్షలు
- 315 మందికి పాజిటివ్
- జీహెచ్ఎంసీ పరిధిలో 83 కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 5,470 మందికి చికిత్స
అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 340 మంది కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,60,786 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,51,425 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,470 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,891కి పెరిగింది.
