రీమేక్ సినిమాలు చేయాలనుకోవడం లేదు: హీరో నాని
- 'టక్ జగదీష్' విభిన్నంగా ఉంటుంది
- అందరూ కొత్త నానీని చూస్తారు
- 'శ్యామ్ సింగ రాయ్' ఈ ఏడాదిలోనే
- వచ్చే ఏడాదిలో 'అంటే సుందరానికీ'
"గతంలో నేను కొన్ని రీమేక్ లు చేశాను .. అవి అంతగా ఆడలేదు. అందువలన నేను రీమేక్ ల ఆలోచన చేయడం లేదు. ఆల్రెడీ ఎక్కడో ఎవరో చేసినవి ఇక్కడ నేను చేయాలనుకోవడం లేదు. మన సినిమాలు వేరేవాళ్లు రీమేక్ చేసుకునేలా ఉండాలి. అలాంటి కొత్త కథలను ఎంచుకునే ఆలోచనలో ఉన్నాను" అని చెప్పారు.
''ఇక 'శ్యామ్ సింగ రాయ్' చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమాను ఈ ఏడాది చివరిలో ప్లాన్ చేస్తున్నాము. అలాగే 'అంటే సుందరానికీ!' సినిమా మూడో షెడ్యూల్ షూటింగులో ఉన్నాము. చాలా బాగా వస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది" అని చెప్పుకొచ్చాడు.