తెలంగాణలో మరింత తగ్గిన కొవిడ్ వ్యాప్తి
- గత 24 గంటల్లో 50,636 కరోనా పరీక్షలు
- 230 మందికి కరోనా పాజిటివ్
- జీహెచ్ఎంసీ పరిధిలో 72 కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 5,545 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 6,59,543 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,50,114 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,545 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,884కి పెరిగింది.
