'టక్ జగదీష్' లాంటి కొడుకు ఉండాలనుకుంటారు: నిర్మాత సాహు గారపాటి
- మా బ్యానర్ నానీతోనే మొదలైంది
- కథ వినగానే ఆయన ఓకే అనేశారు
- థియేటర్లలోనే రిలీజ్ చేయాలకున్నాము
- ఇప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు
"ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే కథ. నానీతోనే మా బ్యానర్ మొదలైంది కనుక, ఆయనతోనే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాము. కథ నచ్చడంతో నానీగారు కూడా వెంటనే ఓకే చెప్పారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ తో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ 'జగదీష్' లాంటి కొడుకు ఉంటే బావుండునని అనుకుంటారు.
పోయిన ఏడాది డిసెంబర్ లోనే ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. అందువల్లనే ఏప్రిల్లో విడుదల చేయాలనుకున్నాము. కరోనా కారణంగా వాయిదావేస్తూ రావలసి వచ్చింది. ఇప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో మేము ఆశించిన స్థాయిలో పరిస్థితులు అనుకూలించడం లేదు. అందువల్లనే థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయలేకపోతున్నాము" అని చెప్పుకొచ్చారు.