వాడీవేడిగా కేఆర్ఎంబీ సమావేశం... వాకౌట్ చేసిన తెలంగాణ

01-09-2021 Wed 19:39 | Both States
  • తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు
  • సయోధ్య కుదిర్చేందుకు కేఆర్ఎంబీ యత్నం
  • బోర్డు చైర్మన్ అధ్యక్షతన సమావేశం
  • తమ నిర్ణయం వెలిబుచ్చిన కేఆర్ఎంబీ చైర్మన్
  • అసంతృప్తితో వెళ్లిపోయిన తెలంగాణ అధికారులు
ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలు తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో ఇవాళ నిర్వహించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం వాడీవేడిగా సాగింది. హైదరాబాదులోని జలసౌధలో కేఆర్ఎంబీ చైర్మన్ ఎమ్.పి.సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కేఆర్ఎంబీ ప్రతినిధులు, ఏపీ, తెలంగాణ అధికారులు హాజరైన ఈ కీలక సమావేశం 5 గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగింది.

ఏపీ తరఫున నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు, ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, నీటిపారుదల శాఖ అంతర్రాష్ట జలవిభాగం సీఈ శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ తరఫున జల వనరుల శాఖ కార్యదర్శి రజత్ కుమార్, నీటి పారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు, అంతర్రాష్ట్ర జలవిభాగం సీఈ మోహన్ కుమార్ హాజరయ్యారు.

2021-22 ఏడాదికి గాను కృష్ణా జలాలపై నీటి కేటాయింపులపై చర్చ జరగ్గా, ఇరు రాష్ట్రాల అధికారులు ఎవరి వాదనలు వారు వినిపించారు. గెజిట్ నోటిఫికేషన్ లోని అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చకు తీసుకువచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కేఆర్ఎంబీ చైర్మన్ ఎమ్.పి.సింగ్ స్పందించారు. నాగార్జున సాగర్, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం కింద సాగు, తాగు నీటి అవసరాలు ఉన్నప్పుడే శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్దేశించారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది తమకు సమ్మతం కాదంటూ వారు సమావేశం నుంచి వాకౌట్ చేశారు.

ఇటీవల పలుమార్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ భేటీ ఎట్టకేలకు జరగడంతో, ఇందులో ఏం నిర్ణయిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. తెలంగాణ వాకౌట్ చేసిన నేపథ్యంలో కేఆర్ఎంబీ నిర్ణయం అమలుపై అనిశ్చితి నెలకొంది. ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ లో కేంద్రం తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుల బాధ్యతలను నదీ యాజమాన్య బోర్డులకు అప్పగించిన సంగతి తెలిసిందే.
KRMBMeetingTelanganaWalkoutAndhra Pradesh

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more