రామ్ ని లైన్లో పెట్టేసిన బోయపాటి!
- 'అఖండ' పనుల్లో బోయపాటి
- రామ్ హీరోగా నెక్స్ట్ మూవీ
- లింగుసామి సినిమాతో బిజీగా రామ్
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
ఈ సినిమా తరువాత రామ్ హీరోగా ఆయన ఒక ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆల్రెడీ ఆయన రామ్ కి కథ వినిపించడం .. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు. ఇది కూడా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గానే ఉంటుందని చెబుతున్నారు.
ప్రస్తుతం లింగుసామి దర్శకత్వంలో రామ్ ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తికాగానే ఆయన చేయనున్న సినిమ ఇదేనని అంటున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తరువాత బన్నీతో బోయపాటి సినిమా ఉంటుందని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయాలపై స్పష్టత రానుంది.