'అఖండ' ఆ రోజునే వస్తాడట!
Add ap7am to your home Screen

'అఖండ' ఆ రోజునే వస్తాడట!

Akhanda will release at Dasara
  • విభిన్న కథా చిత్రంగా 'అఖండ'
  • విలక్షణ పాత్రల్లో బాలకృష్ణ 
  • బోయపాటితో ఆయన మూడో మూవీ 
  • దసరాకి విడుదలయ్యే ఛాన్స్
బాలకృష్ణ కథానాయకుడిగా 'అఖండ' రూపొందుతోంది. దర్శకుడు బోయపాటి ఈ సినిమాలో బాలకృష్ణను మరింత డిఫరెంట్ గా చూపించనున్నాడు. రైతుగాను .. అఘోర గాను ఆయన రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నాడు. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా నిర్మితమవుతున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది.

దసరా .. దీపావళి .. సంక్రాంతికి సినిమాలు ముందుగానే ఫిక్స్ కావడంతో, 'అఖండ' ఎప్పుడు రిలీజ్ కానుందనే విషయం అందరిలో ఆసక్తిని పెంచుతూ వెళుతోంది. అయితే దసరా బరిలో నుంచి 'ఆర్ ఆర్ ఆర్' తప్పుకోనుండటంతో, అదే రోజున 'అఖండ'ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది.

'ఆర్ ఆర్ ఆర్' ను అక్టోబర్ 13నే విడుదల చేయాలనుకున్నారు. ఇప్పుడు నిర్మాతలు ఆ ఆలోచన విరమించుకోవడంతో, అదే రోజున 'అఖండ' రంగంలోకి దిగుతుందని అంటున్నారు. ప్రగ్యా జైస్వాల్ కథనాయికగా నటించిన ఈ సినిమాలో, ఒక ముఖ్యమైన పాత్రలో పూర్ణ కనిపించనుంది. ఈ సినిమాతో బాలకృష్ణ - బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొడతారేమో చూడాలి.
Balakrishna
Pragya
Poorna

More Telugu News