ఏపీలో ఈ ఏడాది పదో తరగతి ఉత్తీర్ణులకు ఆన్ లైన్లో మైగ్రేషన్ సర్టిఫికెట్ల జారీ
- ఈ ఏడాది పరీక్షలు లేకుండానే టెన్త్ పాస్
- మైగ్రేషన్ సర్టిఫికెట్లకు ఆన్ లైన్ లో దరఖాస్తులు
- రేపటినుంచి దరఖాస్తుల ప్రక్రియ
- 2004 తర్వాత టెన్త్ పాసైన వారికీ వెసులుబాటు
ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రక్రియ రేపటి నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపింది. అంతేకాదు, 2004 తర్వాత టెన్త్ పాసైన వారు కూడా మైగ్రేషన్ సర్టిఫికెట్ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ వివరించింది. ఈ ఏడాది కరోనా వ్యాప్తి కారణంగా పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణత ప్రకటించడం తెలిసిందే.