చిరంజీవి ఇంట వరలక్ష్మీ వ్రతం వేడుక... ఫొటో ఇదిగో!
- నేడు వరలక్ష్మీ వ్రతం పండుగ
- తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ
- వ్రతం ఆచరించిన అంజనాదేవి, సురేఖ, ఉపాసన
- ఫొటో పంచుకున్న ఉపాసన
తాజాగా, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నివాసంలోనూ శ్రావణ శుక్రవారం కళ ఉట్టిపడింది. ఈ పుణ్యదినాన చిరంజీవి నివాసంలోనూ వరలక్ష్మి వ్రతం ఆచరించారు. దీనికి సంబంధించిన ఫొటోను రామ్ చరణ్ అర్ధాంగి కొణిదెల ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఈ ఫొటోలో అంజనాదేవి, సురేఖ, ఉపాసన, శ్రీజ కుమార్తె దర్శనమిచ్చారు. కొణిదెల వారింట నాలుగు తరాల స్త్రీలు కలిసి వరలక్ష్మి వ్రతం ఆచరించిన వేళ అంటూ ఉపాసన ఈ ఫొటోపై వ్యాఖ్యానించారు.