Nani: 'టక్ జగదీష్' రిలీజ్ పై స్పందించిన నాని!

 Nani reacted on Tuck Jagadish release
షార్ట్స్‌లో చూడండి
నాని - శివ నిర్వాణ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'నిన్నుకోరి' సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత ఈ ఇద్దరూ కలిసి చేసిన సినిమానే 'టక్ జగదీష్. సాహు గారపాటి - హరీశ్ పెద్ది ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు. ఏప్రిల్లో విడుదల కావలసిన ఈ సినిమా, కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే కథ. ఈ సినిమాలో నాని సరసన నాయికగా రీతూ వర్మ నటించగా, ఆయన అన్నయ్య పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. ఈ సినిమా థియేటర్లకు వస్తుందా? ఓటీటీకి వెళుతుందా? అనే సందిగ్ధంలో అభిమానులు ఉన్నారు. ఈ విషయంపై తాజాగా నాని స్పందించాడు.

'నా సినిమాను నాకు థియేటర్లలోనే చూసుకోవాలని ఉంటుంది. థియేటర్లలో సినిమా చూస్తే కలిగే ఆనందం వేరు .. అనుభూతి వేరు. థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డు చూసినప్పుడు పొందే సంతోషం అంతా ఇంతా కాదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు వేరు. వాటివలన నిర్మాతలు ఎదుర్కునే సమస్యలు వేరు. అందువలన ఈ సినిమా రిలీజ్ విషయంలో నా నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను గౌరవిస్తాను" అంటూ చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Nani
Ritu Varma
Jagapathi Babu

More Telugu News