Corona Virus: దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్

corona bulletin in inida
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కొత్త‌గా నమోదైన కరోనా కేసుల సంఖ్య మొన్న‌టి కంటే దాదాపు 10 వేలు పెరిగింది. నిన్న 35,178 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,22,85,857కు చేరింది. అలాగే నిన్న క‌రోనా నుంచి 37,169 మంది కోలుకున్నారు.
 
ఇక మరణాల విషయానికొస్తే... నిన్న 440 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,32,519కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,14,85,923 మంది కోలుకున్నారు.  

3,67,415 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. అలాగే, దేశంలో నిన్న 55,05,075 వ్యాక్సిన్ డోసులు వేయగా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 56,06,52,030 డోసుల వ్యాక్సిన్లు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News