అమరరాజా బ్యాటరీస్‌లో పీసీబీ, ఐఐటీ మద్రాస్ నిపుణుల తనిఖీ నివేదికను సమర్పించండి: ఏపీపీసీబీని ఆదేశించిన హైకోర్టు
- ఉద్యోగుల రక్తంలో లెడ్ శాతాన్ని పరీక్షించేందుకు పీసీబీకి సహకరించాలంటూ కంపెనీకి సూచన
- స్టే ఉత్తర్వులు మరో ఆరు వారాల పొడిగింపు
- కాలుష్య నియంత్రణతోపాటు ఉద్యోగాలు కూడా అంతే ముఖ్యమన్న హైకోర్టు ధర్మాసనం
కాలుష్య నియంత్రణ అవసరమేనని అభిప్రాయపడిన కోర్టు.. ఉద్యోగాలు కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించింది. అమరరాజా బ్యాటరీస్ పెద్ద పరిశ్రమ అని, అందులో చాలామంది ఉద్యోగులు పనిచేస్తుండడంతో స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అలాగే, ఈ కేసు కోర్టులో పెండింగ్ లో ఉండడంతో ఈ వ్యవహారాలకు సంబంధించి మీడియాతో మాట్లాడకుండా పీసీబీ సభ్య కార్యదర్శి, ఇతర అధికారులకు సూచించాలని సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డిని ధర్మాసనం ఆదేశించింది.