Corona Virus: దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

India reports 35499 new cases in last 24 hours
షార్ట్స్‌లో చూడండి
భార‌త్‌లో నిన్న 35,499 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,19,69,954కు చేరింది.

ఇక మరణాల విషయానికొస్తే... నిన్న  447 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,28,309కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,11,39,457 మంది కోలుకున్నారు. 4,02,188 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 50,86,64,759 వ్యాక్సిన్ డోసులు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు. రిక‌వ‌రీ రేటు 97.40 శాతంగా ఉంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News