తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు ఇవిగో!

01-08-2021 Sun 17:41 | Telangana
  • సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ
  • ప్రగతిభవన్ లో క్యాబినెట్ సమావేశం
  • పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
  • అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేసిన సీఎం
ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ క్యాబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆరోగ్య, వైద్య అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే 5 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులపై మంత్రిమండలి చర్చించింది. ఈ ఆసుపత్రుల సత్వర నిర్మాణం కోసం తీసుకోవాల్సిన చర్యలు, ఇప్పటివరకు జరిగిన పురోగతిపై మంత్రిమండలి సభ్యులు చర్చించారు. త్వరలో వీటి నిర్మాణం కోసం శంకుస్థాపన చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

నిర్ణయాలు ఇవే...

  • వరంగల్, చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణం, టిమ్స్, ఎల్బీ నగర్ గడ్డి అన్నారం, ఆల్వాల్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశం.

  • అన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఇకపై తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) గా నామకరణం.

  • అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను ఒక్కచోటనే అందించే సమీకృత వైద్య కళాశాలలుగా కొత్త సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు.

  • మంజూరైన మెడికల్ కాలేజీలను వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించడానికి సమకూర్చుకోవాల్సిన మౌలిక వసతులు, కాలేజీలు, హాస్టళ్ల నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు.

  • రాష్ట్రంలో మున్ముందు అనుమతించబోయే మెడికల్ కాలేజీల కోసం స్థలాన్వేషణ, తదితర సౌకర్యాల రూపకల్పనకు సంబంధించి ముందస్తు చర్యలను ఇప్పటినుంచే ప్రారంభించాలని వైద్యాధికారులకు సీఎం ఆదేశం.

  • అవసరమున్న జిల్లాల్లో వచ్చే ఏడాదికి మెడికల్ కాలేజీల ఏర్పాట్ల కోసం చర్యలు ప్రారంభించాలని, అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని క్యాబినెట్ ఆదేశం.

  • పటాన్ చెరువులో కార్మికులు, ఇతర ప్రజా అవసరాల కోసం కొత్తగా ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరు

TelanganaCabinet MeetingCM KCRDecisions

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more